బులవాయో: ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్( U19 World Cup)లో ఇవాళ భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. అయితే ఇరు దేశాలకు చెందిన కెప్టెన్లు ఇవాళ టాస్ సమయంలో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే టాస్ వేసిన సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హన్ యూసుఫ్‌లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఆటగాళ్ల లిస్టును పంచుకున్న ఇద్దరూ ఒకరికి ఒకరు కరచాలనం చేసుకోలేదు. ఇ టీవల ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. సీనియర్ల ఆసియాకప్ సమయంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్‌కు హేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇండోపాక్ మ్యాచ్ జరిగిన టైంలో ఇరు దేశాల కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. ఆసియాకప్ రైజింగ్స్ స్టార్స్ మ్యాచ్ సమయంలోనూ ఇండియా ఏ, పాకిస్థాన్ ఏ జట్ల కెప్టెన్లు కూడా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. సీనియర్ క్రికెటర్ల అడుగుజాడల్లోనే జూనియర్లు ప్రవర్తిస్తున్నారు.