బొమ్మలరామారం, జూలై 24: మరణించిన కార్యకర్తల కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచి ఆదుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలంలోని నాగినేనిపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు కట్ట సాయిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోలిపేట మాజీ సర్పంచ్ పూడూరి నవీన్‌గౌడ్ తల్లి పార్వతమ్మ ఇటీవల మరణించారు. వారి కుటుంబాలను శుక్రవారం ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా నిలిచి వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు.
రైతు బీమా ఏమైంది?
‘ప్రమాదంలోగానీ, సాధారణంగాగానీ రైతులు మరణిస్తే కేసీఆర్ ప్రభుత్వంలో పది రోజుల్లోగా రైతుబీమా సొమ్ము అందేది. మధ్యవర్తిత్వం లేకుండా వారి కుటుంబాల ఖాతాల్లో రూ.5 లక్షలు పడేవి. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రైతు బీమా అందడం లేదు’ అని హరీశ్‌రావు అన్నారు. అనంతరం మండ ల వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడుతూ రైతు బీమా పెండింగ్‌లో ఉండటానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 10 మంది రైతులకు రైతు బీమా సొమ్ము వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుధీర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గూదె బాలనర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, సర్పంచ్‌లు పెద్దిరెడ్డి మల్లారెడ్డి, బట్కీరు బీరప్ప, బుడుమ వెంకటేశ్, ఈగల బాల్‌రాజ్, కూర వెంకటేశ, డోకూరి అయిలయ్య, మన్నె శ్రీధర్, ఆంజనేయులు, పెద్దులు, బోనంకూర మల్లేశ్, మైలారం రామకృష్ణ, రాజన్ నాయక్, నర్సింహ తదితరులు ఉన్నారు.