IND vs SL : యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరోసారి క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. తొలి వికెట్‌కు రోహిత్ శర్మ(42)తో కలిసి 95 పరుగులు జోడించాడు. ప్రస్తుతం గిల్ 50, కోహ్లీ 18 రన్స్‌తో ఆడుతున్నారు. తన మార్క్ షాట్లతో అలరించిన రోహిత్ మరోసారి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 42 పరుగులు చేసిన అతను కరుణరత్నే బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 19 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 119 రన్స్ చేసింది.
తిరువనంతపురంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు వన్డేల్లో గెలిచిని భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఈ వన్డేలో కూడా విజయం సాధించి 3-0తో సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌కు చోటు లభించింది.