IND vs SL : టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ (28) వికెట్ సమర్పించుకున్నాడు. స్పిన్నర్ ధనంజయ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆవిష్క ఫెర్నాండో క్యాచ్ అందుకోవడంతో అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేసిన అయ్యర్, కోహ్లీతో పోటీపోటీగా బౌండరీలు బాదుతూ లంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచాడు. 32 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ 35, రాహుల్ 5 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ (83), శుభ్‌మన్ గిల్ (70) శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు.దసున్ షనక బౌలింగ్‌లో గిల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. కొంచెం సేపటికే హిట్‌మ్యాన్ బౌల్డ్ కావడంతో రెండో వికెట్ కోల్పోయింది. మధుషనక వేసిన ఓవర్లో రోహిత్ వెనుదిరిగాడు.