IND vs SL : తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. 41 బంతుల్లోనే 51 రన్స్ చేశాడు. హసరంగ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 47వ అర్థ సెంచరీ. ప్రస్తుతం ఇండియా 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 రన్స్ చేసింది. విరామం తర్వాత జట్టులోకి వచ్చిన హిట్‌మ్యాన్ దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35) కూడా హాఫ్ సెంచరీకి ఏరువలో ఉన్నాడు. హసరంగ వేసిన 11వ ఓవర్లో రోహిత్ ఎల్బీ కోసం అప్పీల్ చేసింది. కానీ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో లంక రివ్యూ తీసుకుంది. అయితే.. బ్యాట్ తగలడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
గువాహటిలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత్ భావిస్తోంది.