హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ టిఫిన్స్ హోట ల్ సంస్థ చట్నీస్పై మంగళవారం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ సంస్థకు చెందిన అనేక టిఫిన్ సెంటర్లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ కేం ద్రంగా నడుస్తున్న మేఘన ఫుడ్స్, ఈటరీస్లోనూ ఐటీ అధికారులు సో దాలు చేపట్టారు.
ఈ దాడులకు సం బంధించి హోటళ్ల యజమానులతోపాటు ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో సోదాలు సాగినట్టు సమాచారం. ఓ ఫార్మా కంపెనీతోపాటు మరో తొమ్మి ది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఐటీ దాడు లు జరగడం సంచలనంగా మారింది.