హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ నివేదికపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలను తరలించాలని సూచించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.