ప్రయాగ్రాజ్: యూపీలోని మథుర ఆలయం కేసులో ముస్లింలకు ఎదురుదెబ్బ తగిలింది. మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గాల వివాదానికి సంబంధించి దాఖలైన 18 కేసులు విచారించ దగ్గవేనని, వాటి విచారణ యథావిధిగా కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ దావాల విచారణను సవాల్ చేస్తూ మసీదు కమిటీ, వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. కేసు విచారణను ఆగస్టు 12వ తేదీ నుంచి కొనసాగిస్తామని తెలిపింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయానికి పక్కనే 13.37 ఎకరాల్లో ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలంటూ హిందూ సంస్థలు పిటిషన్లు వేశాయి.
జూలైలో 8,383 మంది టెకీలకు ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది జూలైలో 34 ప్రముఖ టెక్ కంపెనీల్లో 8,383 మంది సాంకేతిక నిపుణులకు ఉద్వాసన పలికారు. ఈ ఏడాది మొత్తం చూస్తే జూలై 30 వరకు 380 కంపెనీలు 1,90,949 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి.