న్యూఢిల్లీ : మనం చేసే పని ఏదైనా మనసు పెట్టి చేస్తే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇరాక్‌లో ఓ బాలుడు చిరునవ్వుతో కాఫీ అమ్ముతున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. బాలుడు నవ్వులు చిందిస్తూ కాఫీని సర్వ్ చేస్తున్న వీడియో అందరి ముఖాలపై నవ్వులు పూయిస్తోంది.
డౌ బర్నాడ్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఇరాక్‌లో ట్రావెల్ బ్లాగర్ డౌ షేర్ చేసిన ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు ఇరాక్‌లోని బస్రాలో కాఫీ అమ్ముతున్నాడు. నవ్వుతూ కాఫీ సర్వ్ చేస్తున్న బాలుడు డబ్బు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నాడు. కాఫీకి డబ్బు తీసుకోవాలని డౌ కోరుతుండటం కనిపించింది.
ఈ పోస్ట్‌కు డౌ ఇరాకీ కైండ్‌నెస్ అని క్యాప్షన్ ఇవ్వగా ఇప్పటివరకూ 40 లక్షల వ్యూస్ వచ్చాయి. క్యూట్ బాయ్ లవ్లీ స్మైల్‌కు మెస్మరైజ్ అయిన నెటిజన్లు కామెంట్ సెక్షన్లో అతడిపై ప్రేమను కురిపించారు. బాలుడి నవ్వులో నిజాయితీ కనిపించిందని, డబ్బు తీసుకునేందుకు నిరాకరిస్తూ కనబరిచిన నిజాయితీ ఆకట్టుకుందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.