న్యూఢిల్లీ: పసిడి దిగుమతిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వస్తున్నా యి. గతేడాది భారత్లోకి 651.24 టన్నుల పసిడి దిగుమతి అయింది. అంతక్రితం ఏడాది దిగుమతైన 719.94 టన్నులతో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నది. లోక్సభలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2018-19లో 982.71 టన్నుల పసిడి దిగుమతైందని, ఆ తర్వాతి ఏడాది నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నదన్నారు.