హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పనిదినాలను(వర్కింగ్ డేస్) ఐదు రోజులకు కుదించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ కే రామకృష్ణారావుకు శుక్రవారం వినతిపత్రం అందజేసింది.
ప్రభుత్వం పీఏసీఎస్ కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, నిర్ణీత సమయంలో ఆడిట్ పూర్తి చేసిందని, పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావు కేంద్రాన్ని కోరారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఎస్సీడీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.