భారత్కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
భారత్కు తక్షణ సహాయం | కొవిడ్-19పై జరుగుతున్న యుద్ధంలో భారత్కు అవసరమైన తక్షణ సహాయాన్ని అమెరికా అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.

వాషింగ్టన్ : కొవిడ్-19పై జరుగుతున్న యుద్ధంలో భారత్కు అవసరమైన తక్షణ సహాయాన్ని అమెరికా అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు. గతేడాది తమ దేశానికి సైతం అవసరమైనప్పుడు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మంగళవారం వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. రెమెడిసివిర్, ఇతర ఔషధాలు సహా అవసరమైన మొత్తాన్ని వెంటనే పంపుతున్నామని తెలిపారు. టీకాల తయారీకి అవసరమైన భాగాలను సైతం తరలిస్తున్నట్లు చెప్పారు. అసలు టీకాలను అమెరికా ఎప్పుడు భారత్కు పంపగలదో ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపారు.
గత సోమవారం జో బిడెన్ సోమవారం మోదీతో సుదీర్ఘంగా మాట్లాడారు. మహమ్మారిపై పోరాటంలో భారత్కు సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం సమస్యలున్నాయని, నోవావాక్స్, ఇతర టీకాలు అందుబాటులోకి రావాల్సి ఉందని, అప్పుడే వ్యాక్సిన్లను ఇతర దేశాలతో పంచుకోగలిగే స్థితిలో ఉంటామని భావిస్తున్నానన్నారు. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో మెడికల్ ఆక్సిజన్, పడకల కొరత పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన
పెయిన్కిల్లర్స్తో కరోనా తీవ్రం: ఐసీఎంఆర్
విద్యాశాఖలో 9000 పోస్టులు!
ఎస్బీఐలో 5454 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

