ఆర్చరీ లీగ్ చాంప్ మైటీ మరాఠాస్
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో మైటీ మరాఠాస్ చాంపియన్‌గా నిలిచింది. స్థానిక జట్టు కాకతీయ నైట్స్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
- రన్నరప్‌తో సరిపెట్టిన కాకతీయ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో మైటీ మరాఠాస్ చాంపియన్‌గా నిలిచింది. స్థానిక జట్టు కాకతీయ నైట్స్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం జరిగిన ఫైనల్లో మరాఠాస్ జట్టు 6-2తో కాకతీయకు చెక్ పెట్టింది.
ఫైనల్లో ఏపీ కుర్రాడు రికర్వ్ స్టార్ బొమ్మదేవర ధీరజ్ 80కి 79 పాయింట్లతో సత్తా చాటితే మైక్ ష్లోసర్ పర్ఫెక్ట్ 80 పాయింట్లతో మరాఠాస్ విజయంలో కీలకంగా నిలిచారు. తుదిపోరులో ఇరు జట్లూ తొలి సెట్లో 75-75తో సమంగా నిలవగా.. రెండో సెట్‌ను ఒక్క పాయింట్ తేడాతో నెగ్గిన మరాఠాస్ కీలక ఆధిక్యం అందుకుంది. మూడో సెట్ కూడా సమం అవ్వడంతో ఆట షూటాఫ్‌కు వెళ్లేలా కనిపించింది.
కానీ, నాలుగో సెట్లో నైట్స్ ఆర్చర్లు గురి తప్పగా.. మరాఠాస్ ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడింది. ఈ సెట్‌ను 79-74తో గెలిచిన మరాఠాస్ మ్యాచ్ గెలిచి విజేతగా నిలిచింది. రెండు గంటల ముందు ఇరు జట్ల మధ్య క్వాలిఫయర్ పోరులో హిట్ ఆర్ మిస్ షూటాఫ్‌లో నైట్స్ 2-0తో మరాఠాస్‌ను ఓడించి నేరుగా ఫైనల్ చేరింది. అయితే, ఎలిమినేటర్‌లో మరాఠాస్ 5-3తో పృథ్వీరాజ్ యోధాస్‌పై నెగ్గి ఫైనల్ చేరుకొని కాకతీయపై ప్రతీకారం తీర్చుకొని ట్రోఫీని ముద్దాడింది. ధీరజ్ బెస్ట్ రికర్వ్ ఆర్చర్‌గా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

