వెలుగు పత్రికది బాధ్యతారాహిత్యం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తప్పుడు కథనాలు ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యానిది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సహా వివిధ దేశాల ఎన్నారై విభాగాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
- ఆధారాల్లేని కథనాలతో కేసీఆర్పై బురదజల్లాలని చూడటం సహించం
- కేసీఆర్కు క్షమాపణలు చెప్పాల్సిందే
- బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
- తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండించిన వివిధ దేశాల బీఆర్ఎస్ ఎన్నారై సంఘాలు
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తప్పుడు కథనాలు ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యానిది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సహా వివిధ దేశాల ఎన్నారై విభాగాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ‘కేసీఆర్ ఫామ్హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ పేరిట వచ్చిన అసత్య కథనాన్ని ప్రచురించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
రైతుల సాగునీటి అవసరాలను కేసీఆర్ వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రానికి ముడిపెట్టి నిరాధార కథనాలు రాయడమేందని మండిపడ్డారు. సాగునీటి శాఖ అధికారిక రికార్డులు, కాలువల అసలు మార్గాలు, అధికారుల వివరణ వంటి ప్రాథమిక సాంకేతిక అంశాలను ప్రజల ముందుంచకుండా సంచలన శీర్షికలతో అపోహలు సృష్టించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హితవు పలికారు. ఆరోపణలు చేసేవారు ఆధారాలు చూపాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేరని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

