Rains in Hyderabad | హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారి.. తీరం దాటిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్ , దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇక జగద్గిరిగుట్ట పరిధిలో అత్యధికంగా 4.5మి.మీ. వర్షపాతం నమోదైంది.