మాగనూరు కృష్ణ : మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు కృష్ణ (Maganur Krishna) ఉమ్మడి మండలాల్లో కృష్ణానది నుంచి రాత్రి వేళ జోరుగా అక్రమ ఇసుక రవాణా (Illegal sand transportation) కొనసాగుతోంది . ఈ విషయంపై సంబంధిత అధికారులు తెలిసినా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక మాఫియా ఆడింది ఆట, పాడింది పాటగా ఇసుక రవాణా కొనసాగుతోంది .
కృష్ణ మండల పరిధిలోని టైరోడ్ సమీపంలో గల ఓంకార మఠం సమీపంలో కొందరు పది టిప్పర్ల( Tipper) ద్వారా అక్రమ ఇసుక నది నుంచి తోడుకొని మఠం సమీపంలో డంపు చేసి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ. 30వేలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణా వెనక సంబంధిత అధికారుల హస్తం ఉండడం వల్లే అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. ముఖ్య మంత్రి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్, ఎస్పీ లకు ఆదేశాలు జారీ చేసినా కూడా కృష్ణ నదిలో అక్రమంగా ఇసుక రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది.
ఆరు టిప్పర్లు పట్టివేత
ఇసుక అక్రమ రవాణా అవుతున్న విషయాన్ని గమనించిన టాస్క్ ఫోర్స్ (Taskforce) సిబ్బంది శనివారం రాత్రి ఓంకార్ మఠం వద్ద ఆరు ట్రిప్పర్లను పట్టుకని కృష్ణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్లు మందరి చౌదరి, దేవ్, పరశురాం, ఆకాష్, మల్లు, తోటప్పలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ ( SI Naveen ) వెల్లడించారు.