హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాం క్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగా ణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిర మ్మ ఇండ్లకు, ఇతర పథకాలకు ఉచిత ఇ సుక పేరుతో టన్నుల కొద్ది ఇసుకను అ మ్ముకుంటున్నారని విమర్శించారు. ఫలితంగా రాష్ర్టానికి ఇసుకపై రావాల్సిన ఆదా యం సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి జేబులోకి వెళ్తున్నదని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీతోపాటు ఇతర కొన్ని ప్రాజెక్టుల వద్ద నీటిని ఖాళీ చేసి మరీ ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. మూడు షిఫ్టుల్లో ఇసుక మైనింగ్ చేయాలని తాజాగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనల కు విరుద్ధమని చెప్పారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఏడాదిలో ఐ దుగురు ఎండీలను ఎందుకు మార్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుతుందని స్ప ష్టంచేశారు. రేవంత్‌రెడ్డి ఇసుక దందాపై మరిన్ని వివరాలను త్వరలో బయటపెడతామని మన్నె క్రిశాంక్ తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ఆదాయం ఏటా రూ.19 కోట్లు దాటలేదని, కేసీఆర్ హయాంలో తెచ్చిన కొత్త ఇసుక పాలసీ తో ఏటా రూ.800 కోట్లకు పైగా ఆ దాయం సమకూరిందని మన్నె క్రిశాంక్ చెప్పారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ర్టానికి ఇసుక ద్వారా ఆదాయం భా రీగా తగ్గిందని తెలిపారు. కేసీఆర్ హ యాంలో పదేండ్లలో రూ.5,900 కోట్ల ఆ దాయం సమకూరిందని స్పష్టంచేశారు. గతంలో పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంత్రి హోదాలో రాష్ర్టానికి వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని, తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పాలసీని ప్రవేశపెడతామని చెప్పారని గుర్తుచేశారు.