French Open : వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్(Iga Swiatek) ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. తొలి రౌండ్ నుంచి రఫ్పాడిస్తున్న ఆమె అలవోకగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌లో అమెరికా టీనేజర్ కొకో గాఫ్(Coco Gauff)పై స్వియాటెక్ సూపర్ విజయం సాధించింది. వరుస సెట్లలో జోరు చూపించి గాఫ్ 6-2, 6-4తో ఓడించి ఇంటికి పంపింది.
ఈ గెలుపుతో గాఫ్‌పై 11వ సారి పైచేయి సాధించింది. టైటిల్ బెర్తు కోల్పోయిన గాఫ్‌కు గొప్ప ఊరట ఏంటంటే.. ఆమె రెండో ర్యాంక్‌కు చేరుకుంది. బెలారస్ ప్లేయర్ అరినా సబలెంక క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో యూఎస్ సంచలనం గాఫ్ రెండో స్థానానికి ఎగబాకింది.
TO A 4TH ROLAND-GARROS FINAL 💪#RolandGarros pic.twitter.com/MU6a7CHFjW
— Roland-Garros (@rolandgarros) June 6, 2024
మట్టి కోర్టు మహరాణిగా పేరు తెచ్చుకున్న స్వియాటెక్‌కు ఇది వరుసగా మూడో ఫైనల్. 2022, 2023లో రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ పోలండ్ సుందరి హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది. ఒకవేళ స్వియాటెక్ మూడోసారి ట్రోఫీ అందుకుంటే.. ఈ ఘనతకు చేరువైన రెండో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఇంతకుముందు మాజీ వరల్డ్ నంబర్ 1 జస్టిన్ హెనిన్(Justin Henin) 2005, 2006, 2007లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది.