రోజులు మారిపోయాయి. ఒకప్పటితో పోల్చితే మదుపరులకు పెట్టుబడికున్న అవకాశాలూ పెరిగిపోయాయి. సంప్రదాయ పెట్టుబడుల స్థానంలో ఇప్పుడు హైటెక్ పెట్టుబడులు వస్తున్నాయి. నేటి తరం వీటిపై మరింతగా దృష్టి సారిస్తే గొప్ప ప్రయోజనాలనే అందుకోవచ్చు. మరి వాటిలో..
ఏఐ ఆధారిత ఈటీఎఫ్‌లు
ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో పెట్టుబడుల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర నయా టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ వైపునకు అడుగులు వేయవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తు అంతా వీటిదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఏఐ ఫోకస్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం ఉత్తమమే.
క్రిప్టో సిప్స్
బిట్‌కాయిన్ వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో సిస్టమ్యాటిక్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ (సిప్).. యువతరానికి బాగా కలిసిరాగలవని మెజారిటీ నిపుణుల అంచనా. దీర్ఘకాలంలో సంపద సృష్టికీ ఇవి దోహదం చేయగలవు.
గ్రీన్ బాండ్లు, డిజిటల్ గోల్డ్
రెన్యువబుల్ ఎనర్జీ, సస్టెయినబుల్ ప్రాజెక్టుల్లో ఫండింగ్ చేసే గ్రీన్ బాండ్లనూ మదుపరులు తమ పెట్టుబడులకు ఎంచుకోవచ్చు. అలాగే యూపీఐ యాప్స్ ద్వారా సూక్ష్మ పెట్టుబడులనూ అనుసరించవచ్చు. పీర్-టు-పీర్ లెండింగ్ సాధనాలనూ పరిశీలించవచ్చు.