గోదావరిఖని : సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్‌ను నియమించారు. ప్రస్తుతం టీజీ జెన్కో సీఎండీగా పనిచేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న 2012 ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సింగరేణి ఇన్చార్జి చైర్మన్‌గా కొనసాగించనున్నారు.
ప్రస్తుతం సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బలరాం పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమించారు. గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జెన్కోలో చైర్మన్‌గా కొనసాగుతున్నారు.