MLA Bandari lakshma reddy | చర్లపల్లి, జూలై 13 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ఎంఎన్ఆర్ బ్యాడ్మింటన్ కోర్టులో ఆదివారం నిర్వహించిన విస్టా బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్‌ను ఆయన నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగించడంతోపాటు శారీరక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, ముఖ్యంగా నియోజకవర్గపరిధిలోని క్రీడామైదానంలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడలను గుర్తించి క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, గంప కృష్ణ, బుచ్చన్నగారి శ్రీకాంత్‌రెడ్డి, యాదగిరి, సురేశ్‌రెడ్డిలతో పాటు కాలనీవాసులు, క్రీడాకారులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం