అమరావతి : పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project) పై ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra babu) గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. గురువారం ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాంబాబు తిప్పికొట్టారు.
పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబుయేనని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాయని వెల్లడించారు.
అబద్దాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడు, నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడు చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తరువాత కేంద్రం రీయింబర్ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇందులో డబ్బుల మళ్లింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.