Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Donald Trump | ఈ ఏడాది కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి (Nobel peace prize) రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సిరాక్యూస్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. నోబెల్ కమిటీ (Nobel Committee) ని, నార్వే (Narway) ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
Donald Trump : ఈ ఏడాది కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి (Nobel peace prize) రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సిరాక్యూస్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. నోబెల్ కమిటీ (Nobel Committee) ని, నార్వే (Narway) ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలు ఆపానని, పరిష్కరించిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ బహుమతి చొప్పున తనకు మొత్తం ఎనిమిదిసార్లు తనకు నోబెల్ పురస్కారం రావాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ కమిషనర్ నవీ పిళ్లైకి దక్కిన నేపథ్యంలో ట్రంప్‌లో అసహనం పెరిగిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా తాను నోబెల్ శాంతి బహుమతి పొందాల్సింది కానీ ఇవ్వలేదని, ఇది నార్వేకు శాశ్వత మచ్చ అని విమర్శించారు. నోబెల్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో నిర్ణయం తీసుకున్న వ్యక్తులు అవమానకరమైన పని చేశారని ట్రంప్ మండిపడ్డారు. నోబెల్ కమిటీని ‘రాడికల్ ఐడియాలజిస్టులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు’ గా ఆయన అభివర్ణించారు.
పురస్కార గ్రహీత నవీ పిళ్లైని ఉద్దేశిస్తూ.. ఆమె పేరు తాను ఎప్పుడూ వినలేదని, యూఎన్‌లో పనిచేసే ఒక లిబరల్ వ్యక్తికి బహుమతి ఇచ్చారని విమర్శించారు. ఆమె మాట ఎవరూ వినరని అంటూనే, అయినా అభినందనలు తెలియజేస్తున్నా అని వ్యంగ్యంగా అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా నివారించి సుమారు 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని వ్యాఖ్యానించారు.
అలాగే ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా అడ్డుకున్నానని, తద్వారా పశ్చిమాసియా, యూరప్, అమెరికాకు పెను ప్రమాదాన్ని తప్పించానని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను కూడా త్వరలోనే ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో నలుగురు అమెరికా అధ్యక్షులు థియోడర్ రూజ్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
ఒబామా అధ్యక్షుడైన తొలి ఏడాదిలోనే పురస్కారం పొందడాన్ని ట్రంప్ తరచూ విమర్శిస్తూ.. ఆయనకు ఏమీ చేయకుండానే బహుమతి ఇచ్చారని వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

