హైదరాబాద్, ఆగస్టు 22( నమస్తే తెలంగాణ) : తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లేఖ రాశారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీరు నచ్చకనే, 40 ఏండ్లుగా పార్టీ జెండా మో స్తున్న కార్యకర్తల ఆవేదనను మాత్రమే తాను వెలిబుచ్చానని లేఖలో వివరించారు.
పార్టీకి వ్యతిరేకంగా మా ట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని, కేవలం పార్టీకి నష్టం కలిగించేవారిని ప్రశ్నించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా శనివారం గాంధీభవన్ లో కా ంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ ఇచ్చిన వివరణ, చిన్నారెడ్డి వివరణపై కమిటీ పరిశీలన జరిపింది.