‘ఇదొక డివోషనల్ థ్రిల్లర్. ‘కాంతార’ ‘కార్తికేయ’ ‘విరూపాక్ష’ జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది. ఇందులో నా పర్ఫార్మెన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది’ అన్నారు హీరో సుమంత్. ఆయన ఐశ్వర్యరాజేష్‌తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు.
కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి ‘వాట్ ఏ లాజిక్ సర్జీ’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. స్పిరిచ్యుయెల్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.