నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా

బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఈ మధ్యే తాను ప్రెగ్నెంట్ అని తన బేబీ బంప్ చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన విషయం తెలుసు కదా. అయితే ప్రెగ్నెంట్ అని తెలిసే నువ్వు వైభవ్‌ను పెళ్లి చేసుకున్నావా అంటూ ఓ అభిమాని ప్రశ్నించింది. పెళ్లికి ముందే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి ఉంటే తప్పేముంది? పెళ్లికి ముందు గర్భం దాల్చడం తప్పా అని కూడా ఆ అభిమాని అడిగింది. దీనికి దియా మీర్జా సుదీర్ఘంగా సమాధానం ఇచ్చింది.
నీ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నేను తల్లి కాబోతున్నానని తెలిసి పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం కలిసి ఉందామనుకొని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అప్పుడే నేను తల్లి కాబోతున్నానని తెలిసింది. ప్రెగ్నెన్సీ వల్ల ఈ పెళ్లి చేసుకున్నానని అనడం సరికాదు. ప్రెగ్నెన్సీ పూర్తిగా సురక్షితం అని తెలిసే వరకూ మేము ప్రకటించలేదు. నా జీవితంలో ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాను అని దియా మీర్జా సమాధానమిచ్చింది.
ఈ ప్రశ్నకు తాను ఎందుకు సమాధానమిస్తున్నానో కూడా ఆమె వివరణ ఇవ్వడం విశేషం. ఈ అందమైన ప్రయాణంలో సిగ్గు పడాల్సిన విషయం ఏమీ ఉండకూడదు. సింగిల్‌గా ఉండాలన్నా, తల్లిగా ఉండాలన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా అది మన ఇష్టమే అని చెప్పేందుకే ఈ సమాధానమిచ్చినట్లు దియా చెప్పింది. ఫిబ్రవరి 15న వైభవ్‌ను పెళ్లి చేసుకున్న దియా.. ఏప్రిల్ 1న తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది.


ఇవి కూడా చదవండి
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

