Nagarjuna | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కూలీ (Coolie). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, మహేంద్రన్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాగార్జున. ‘లోకేశ్ కనగరాజ్ కథను వివరించడం మొదలుపెట్టినప్పుడు ప్లాట్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. రజినీకాంత్‌గారు నిజంగానే ఈ కథను ఒప్పుకున్నారా..? అని నేను లోకేశ్‌ను అడిగా. అదే నా మొదటి ప్రశ్న.. ఎందుకంటే కూలీలో నా పాత్ర డైనమిక్‌గా ఉండటమే కాదు.. దాదాపు హీరోలా కనిపిస్తుంది. లోకేశ్ కనగరాజ్ తన విలన్లను హీరోలా పవర్‌ఫుల్‌గా చూపిస్తాడు. ప్రత్యేకించి విక్రమ్‌లో ఫహద్పాసిల్, విజయ్ సేతుపతి పాత్రలు అద్భుతంగా డిజైన్ చేశాడు. వారి పాత్రలకు సాలిడ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఏజెంట్ టీనా పాత్ర కూడా అందరినీ షాక్‌కు లోను చేసిందంటూ’ చెప్పుకొచ్చాడు నాగార్జున.
బ్యాంకాక్ షిప్లో 15 రోజుల పాటు షూట్ చేశాం. షూటింగ్ అంతా చాలా సవాలుగా సాగింది. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రజినీకాంత్ సార్ యూనిట్ మెంబర్స్ అందరికీ డబ్బులు ఇచ్చి.. వారి కుటుంబసభ్యుల కోసం ఏదైనా కొనుక్కోమని చెప్పారన్నాడు నాగ్.
అయితే తనను నెగెటివ్ షేడ్స్‌లో చూపించే ఇలాంటి అనవసరం కామెంట్స్ చేయొద్దంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కూలీ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్ండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Kantara 3 | కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్… ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Kamal Hassan | సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్
Film Chamber | లేబర్ కమిషనర్‌ను కలవనున్న ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు