హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ (సీసీపీఎల్) రెండో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. థాయిలాండ్‌లోని పుకెట్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో రెండో సీజన్‌కు 8 ఫ్రాంచైజీల జట్లు సిద్ధమవుతున్నాయి. గతేడాది హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (హెచ్పీఎల్) ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు సీసీపీఎల్గా మరింత ఆకర్షణీయంగా వస్తోందని నిర్వాహకులు బియ్యాల యశ్వంత్, విక్రాంత్ రావు తెలిపారు. మరో ఆరో వారాల్లో లీగ్ మొదలవుతుందన్నారు.