మెట్రో రైలు టేకోవర్‌పై నీలినీడలు
ఆర్భాటాలకు పోయి హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును టేకోవర్ చేసుకుంటామని ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్.. ఆచరణలో పూర్తిగా చతికిలపడింది. స్వాధీనానికి నిధుల సమీకరణలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేక అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్నది.
- ప్రభుత్వం మాటలకే పరిమితం.. కేంద్రం షరతుతో చతికిల
- నిధుల సమీకరణలో వైఫల్యం.. అప్పుల కోసం అగచాట్లు
ఆర్భాటాలకు పోయి హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును టేకోవర్ చేసుకుంటామని ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్.. ఆచరణలో పూర్తిగా చతికిలపడింది. స్వాధీనానికి నిధుల సమీకరణలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేక అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో పూర్తిగా చతికిలపడింది. రెండో దశ మెట్రో విస్తరణకు ఆమోదం పొందాలంటే తప్పనిసరిగా తొలి దశను స్వాధీనం చేసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రేవంత్‌రెడ్డి సర్కార్‌కు దికుతోచని పరిస్థితి ఏర్పడింది. కేవలం మాటలతో కాలక్షేపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో తొలి దశ టేకోవర్‌కు కావాల్సిన నిధుల సమీకరణలో ఒక ముందడుగు కూడా వేయలేకపోతున్నది.
ప్రభుత్వం తరఫున కన్సల్టెన్సీగా నియమించిన ఎస్బీఐ క్యాపిటల్స్ ప్రతినిధులను వెంటేసుకుని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా కేవలం 3% వడ్డీతో రూ.13,600 కోట్ల రుణాలు ఇవ్వాలంటూ తాజాగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) అధికారులను సంప్రదించారు. దీంతో ఇంత తక్కువ వడ్డీకి ఎవరు అప్పులిస్తారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలయాపన చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రం చేతిలో కీలుబొమ్మ
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్-ఏ కింద 7 కారిడార్లలో 122.9 కి.మీ. మేర నిర్మాణాలు చేపడుతామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత డీపీఆర్ అనుమతుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత ఎల్అండ్టీ సంస్థ నుంచి మొదటి దశను టేకోవర్ చేయాలని, ఆ తర్వాతే రెండో దశ అనుమతుల గురించి మాట్లాడుదామని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చతికిలబడింది.
దీంతో చేసేదేమీ లేక హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఢిల్లీకి పరుగులు పెట్టి కేంద్రాన్ని బతిమిలాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు ఎస్బీఐ క్యాపిటల్స్ ప్రతినిధులతో కలిసి పీఎఫ్సీ అధికారులను వేడుకోవడాన్ని, మరోవైపు ఎల్అండ్ టీ వర్గాలు కూడా అదే పీఎఫ్‌సీని సంప్రదించి అప్పుల కోసం అర్జీలు పెట్టుకోవడాన్ని చూస్తుంటే మెట్రో టేకోవర్ అంతులేని వ్యవహారంగా మారినట్టు స్పష్టమవుతున్నది.
రెండో దశ విస్తరణ ప్రశ్నార్థకమే
అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక హామీని కూడా అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్.. మెట్రో ప్రాజెక్టును కూడా గాలికి వదిలేసింది. సొంతంగా నిధులు సమకూర్చుకునే దమ్ములేక అప్పుల కోసం ప్రైవేట్ సంస్థల చుట్టూ, ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతూ ప్రజలను మోసగిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పూటకో మాట, రోజుకో అబద్ధం’ విధానంతో హైదరాబాద్ ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రెండో దశ విస్తరణ ప్రశ్నార్థకంగా మారుతున్నది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో ముందుకు రావాలని, లేకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

