సాగర్ కాలువలో రసాయనాల పారబోత
నాగార్జునసాగర్ వరద కాలువలో గుర్తుతెలియని దుండగులు ప్రమాదకరమైన రసాయనాలను పారబోసిన ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
- ఎరుపు రంగులోకి మారిన నీరు.. దుర్వాసన
- పెద్దవూర ప్రాంత రైతులు, ప్రజల ఆందోళన
- దర్యాప్తు చేపడుతున్న పోలీసులు, ఇరిగేషన్ అధికారులు
పెద్దవూర, నవంబర్ 1: నాగార్జునసాగర్ వరద కాలువలో గుర్తుతెలియని దుండగులు ప్రమాదకరమైన రసాయనాలను పారబోసిన ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మండలంలోని చింతపల్లి సమీపంలో గల బసిరెడ్డిపల్లి ప్రాంతంలో కాలువలో ప్రవహిస్తున్న నీరు ఒకసారిగా ఎరుపు రంగులోకి మారి జిడ్డుగా ఉండటంతోపాటు ఘాటు వాసన రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను కాలువ నీటిలోకి పారబోసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.
నీరు ఎరుపు రంగులోకి మారడంతోపాటు పరిసర ప్రాంతాల్లో వాసన వ్యాపించిందని స్థానికులు చెప్తున్నారు. కాలువ నీటిపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే వేలాది మంది ప్రజలు, రైతాంగం, మూగజీవాల భద్రతపై తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు, రైతులకు ఎలాంటి ప్రాణహాని, తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ ఘటనపై లోలెవల్ కెనాల్ ఏఈ, పెద్దవూర ఎస్సై గోపాలరావు స్పందిస్తూ కాలువలో ప్రమాదకర రసాయనాలు పారబోసిన వారిని త్వరలో గుర్తిస్తామని చెప్పారు. కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. పరిసర ప్రాంతాలతో పాటు రహదారుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

