బడంగ్‌పేట, మార్చి 30: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ పరిధిలోని సీతా ఎవెన్యూ కాలనీలో బుధవారం డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బండారి మనోహర్, ఎర్ర మహేశ్వరి జైయింద్తో కలిసి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తాగునీటి పైపులైన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
మారి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సన్మానం
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మారి స్వచ్ఛంద సంస్థలో పని చేసి సేవలు అందించిన ప్రతినిధులకు బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్చార్జి సిలివేరు సాంబశివ, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.