
కందుకూరు. నవంబర్ 22 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బైరాగిగూడలోని అందుగుల సత్యనారాయణ గార్డెన్లో గ్రామాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టితో పెట్టుకొని వివిధ పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తుంటే.. ప్రతి పక్షాలు తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, వారి విమర్శలను తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.