
కీసర, నవంబర్ 22 : కీసరలోని రోడ్లు చిత్తడి చిత్తడిగా మారడంతో బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలకు బస్తీలోని మట్టిరోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారాయి. కీసర మండల కేంద్రంలోని ఒకటో వార్డులో రోడ్డుపై వర్షపునీరు నిలువడంతో బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి గుంతల్లో మట్టిపోయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును వివరణ కోరగా… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై నివేదిక తీసుకుంటున్నామని పేర్కొన్నారు.