ఎర్రగడ్డ, మార్చి 12: నియోజకవర్గంలో వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన నిధుల కేటాయింపు ఉంటుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో రూ.12.80 లక్షలతో చేపట్టిన తాగునీటి పైపులైన్ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎర్రగడ్డ విషయానికి వస్తే డివిజన్‌కు తక్కువ వ్యవధిలో అధిక నిధులను మంజూ రు చేయించటం జరిగిందన్నారు. డివిజన్లోని ఇతర బస్తీలు, కాలనీలకు మంజూరైన అభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుడతామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్‌బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, పలువురు సీనీయర్ నేతలు పాల్గొన్నారు.