
ఉప్పల్, నవంబర్ 20 : రైతులకు మద్దతుగా చేపట్టిన సీఎం కేసీఆర్ ధర్నాకు, రైతుల పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శనివారం నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నాచారం హెచ్ఎంటీనగర్ ప్రాంతంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనం తరం జై కిసాన్.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. యాసంగి వడ్లు కొనాలంటూ రైతులకు మద్దతుగా చేపట్టిన ధర్నాకు, రైతుల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ నేత సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బీసీసెల్ అధ్యక్షుడు విఠల్‌యాదవ్, యూత్ అధ్యక్షులు దాసరి కర్ణ, మారయ్య, నిర్మలారెడ్డి, రాంచందర్, రమణారెడ్డి, సుగుణాకర్‌రావు, కట్ట బుచ్చ న్న, హరిప్రసాద్, నవీన్‌రెడ్డి, వాసు, శ్రీను, జహంగీర్, రాజు, చంద్రశేఖర్, అశోక్, రమేశ్, శంకర్ పాల్గొన్నారు.