
హిమాయత్‌నగర్, నవంబర్ 18: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని నూతన జంట కేశపాకు పృథీరాజ్(25), జీడికపల్లి మానస(23) నగర సీపీ అంజనీకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. గు రువారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రేమించుకొని.. ఇష్టపూర్వకంగా ఈనెల 11న రామంతాపూర్‌లోని శ్రీరామ సహిత సత్యనారాయణస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నామని, 17న బంజారాహిల్స్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. మానస తల్లిదండ్రులు పృథ్వీరాజ్‌కు ఫోన్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు.