
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: ప్రైవేట్ ట్రావెల్స్‌లో పనిచేస్తున్న వ్యక్తి పదిరోజులు దాటినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటలోని ఇందిరానగర్ ఏ కాలనీలో నివాసముండే చలమలశెట్టి సుబ్రమణ్యేశ్వర్‌రావు (43)కు 19 ఏండ్ల క్రితం మాధవితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. పదిహేనేళ్లుగా సుబ్రమణ్యేశ్వర్‌రావు ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లి వారం రోజుల్లో ఇంటికొచ్చేవాడు. అయితే ఈ నెల 6న అతడి భార్య మాధవి పనికెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె భర్త ఇంట్లో లేరు. అతడి కోసం ఎక్కడ వెతికనా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం అతడి భార్య లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.