
చర్లపల్లి, నవంబర్ 17 : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (వ్యవసాయక్షేత్రం) సూపరింటెండెంట్‌గా కళాసాగర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇక్కడ పనిచేసిన శివకుమార్‌గౌడ్ చంచల్‌గూడ జైలుకు సూపరింటెండెంట్‌గా బదిలీపై వెళ్లడంతోఆయన స్థానంలో నల్గొండ జిల్లా సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న కళాసాగర్ వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కళాసాగర్ మాట్లాడుతూ వ్యవసాయక్షేత్రంలోని ఖైదీలు, సిబ్బంది సంక్షేమం కోసం తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. కాగా, వ్యవసాయక్షేత్రం డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం, జైలర్ సాయిసురేశ్బాబు, వార్డర్లు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.