DCW vs GGW : ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఆరంభంలో తడబడినా ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. పవర్ ప్లేలో చిన్నెల్లీ హెన్రీ(3-35), నందిని శర్మ (2-44)ల విజృంభణతో కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను బేత్ మూనీ(62 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆదుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మొక్కవోని సంకల్పంతో ఆడిన తను జార్జియా వరేహం(35) తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించింది. ఆఖర్లో కష్వీ గౌతమ్(18), మూనీలు బౌండరీలతో చెలరేగగా నిర్ణీత ఓవర్లలో 168 పరుగులతో ఢిల్లీకి సవాల్ విసిరింది గుజరాత్.
మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్లోభారీ స్కో్ర్ కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు రెండో ఓవర్లోనే చిన్నెల్లీ (3-35) షాకిచ్చింది. డేంజరస్ సోఫీ డెవినె(6)ను ఆడిన బంతిని కీపర్ లిజెల్లీ ఒంటిచేత్తో అందుకుంది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే నందిని శర్మ(2-44) వరుస ఓవర్లలో అనుష్క శర్మ(16), అష్లీ గార్డ్నర్(0)లను వెనక్కి పంపింది. అనుష్క ఆడిన బంతిని డైవ్ చేసి హెన్రీ అందుకోగా.. ఆ తర్వాత బంతికి గార్డ్నర్ స్లిప్‌లో స్నేహ్ రానా చేతికి చిక్కింది. దాంతో.. 38కే గుజరాత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. బేత్ మూనీ(62 నాటౌట్)తో 21 రన్స్ జోడించిన కనికా ఆహుజా(6) మిన్ను మణి ఓవర్లో స్టంపౌట్ కావడంతో.. 59కే నాలుగు వికెట్లు పడ్డాయి.
Big match 🤝 Big player
🎥 Crucial final flourish from the highly experienced Beth Mooney 🫡
Updates ▶️ https://t.co/seGdvpFWwh
#TATAWPL | #ClaimTheCrown | #GGvDC | #Eliminator | @Giant_Cricket pic.twitter.com/b4JrpMQyKJ— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
మూనీ జతగా.. జార్జియా వరేహం(35) సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్ నిర్మించింది. ఢిల్లీ స్పిన్నర్లు మిన్ను, రానాలను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్వయం.. స్కోర్ వంద దాటించింది. భారీ సిక్సర్లతో హెన్రీ ఓవర్లో బౌండరీ వద్ద వొల్వార్డ్త్ చేతికి దొరికింది. ఆదే ఓవర్లో భారతి ఫుల్మాలి(0) హెన్రీకి క్యాచ్ ఇవ్వగా గుజరాత్. అనంతరం వచ్చిన కష్వీ గౌతమ్ (18) బౌండరీలతో చెలరేగింది. మూనీ చివరి బంతికి బౌండరీ బాదగా గుజరాత్ 168 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది.
Partnership broken 👏
Courtesy Chinelle Henry’s excellent double delight over ✌️
Updates ▶️ https://t.co/seGdvpFWwh
#TATAWPL | #ClaimTheCrown | #GGvDC | #Eliminator | @DelhiCapitals pic.twitter.com/jvfq7sI3y0— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026