Harish Rao : ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మృతిపట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన ఖాద్రీ మరణం ఎంతో బాధించిందని పేర్కొన్న హరీశ్ రావు.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ మరణ వార్త ఎంతో బాధించింది. సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా అంకితభావంతో ఆయన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. ఈ విషాదకరమైన సమయంలో ఆయన కుటుంబసభ్యులకు హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నా. ఖాద్రీ ఆత్మకు శాంతి చేకూరాలి అని హరీశ్ రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
Deeply saddened to hear about the passing of former MIM MLA, Sri Ahmed Pasha Quadri garu. His long and dedicated service as a legislator will always be remembered. My heartfelt condolences to his family and supporters in this moment of grief. May his soul rest in peace. pic.twitter.com/FZ0PpSlhHe
— Harish Rao Thanneeru (@BRSHarish) February 3, 2026
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా ఖాద్రీ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏఐఎంఐఎం పార్టీతో కొనసాగిన ఆయన.. 72 ఏళ్ల వయసులో మరణించారు. ఆరోగ్య సమస్యల కారణంగా 2023లో ఖాద్రీ ఎన్నికల్లో పోటీకి దూరమైన ఆయన.. ఆపై పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూసుకున్నారు. ఏఐఎంఐఎం పార్టీ వ్యవస్థాపకుడు సలాలుద్దీన్ ఒవైసీకి విశ్వసనీయుడైన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కీలక నేతగా ఎదిగారు.