Syed Ahmed Pasha Quadri : ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (Syed Ahmed Pasha Quadri) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏఐఎంఐఎం పార్టీతో కొనసాగిన ఆయన.. 72 ఏళ్ల వయసులో మరణించారు. ఆరోగ్య సమస్యల కారణంగా 2023లో ఖాద్రీ ఎన్నికల్లో పోటీకి దూరమైన ఆయన.. ఆపై పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూసుకున్నారు.
ఏఐఎంఐఎం పార్టీ వ్యవస్థాపకుడు సలాలుద్దీన్ ఒవైసీకి విశ్వసనీయుడైన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుత అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతోనూ సఖ్యతో మెలిగిన ఖాద్రీ.. చార్మినార్ నుంచి మూడుసార్లు (2004 నుంచి 2018) ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం యాకుత్‌పుర నియోజకవర్గ ప్రతినిధిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Inna Lillahi Wa Inna illahi Rajioon. Ex MLA ( AIMIM ) Syed Ahmed Pasha Quadri sahab Passed Away. pic.twitter.com/10qclaHtVs
— 4tv News Channel (@4tvhyd) February 3, 2026
2023 నుంచి ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల కారణంతో ఖాద్రీ.. పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూసుకున్నారు. ఈమధ్య కాలంలో రెండు పర్యాయాలు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు కూడా. అయినా సరే ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో మంగళవారం ఖాద్రీ కన్నుమూశారు.