DCW vs GGW | ఎలిమినేటర్‌లో గుజరాత్‌కు ఝలక్.. నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ..!
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్ ట్యాగ్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్ కలల్ని భగ్నం చేస్తూ.. టైటిల్ పోరుకు సిద్ధమైంది.
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్ ట్యాగ్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్ కలల్ని భగ్నం చేస్తూ.. టైటిల్ పోరుకు సిద్ధమైంది ఢిల్లీ. 169 పరుగుల ఛేదనలో ఓపెనర్లు లిజెల్లే లీ(43), షఫాలీ వర్మ(31) అదిరే ఆరంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(41) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయింది. ఫిబ్రవరి 5న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
లీగ్ దశలో గుజరాత్ జెయింట్స్ చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్‌లో గర్జించింది. తొలిసారి ఫైనల్ ఆడాలనుకున్న గుజరాత్ ఆశల్ని ఆడియాసలు చేసింది. బౌలర్ల కృషిని వృథా చేయకుండా బ్యాటర్లు దంచేయగా.. భారీ లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్మనిపిచింది ఢిల్లీ. టాప్ క్లాస్ ఆటతో గుజరాత్‌కు చెక్ పెట్టిన ఢిల్లీ నాలుగోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
Sweet striking from the @DelhiCapitals captain 🙌
Jemimah Rodrigues’ delightful shots to power #DC‘s chase 🔝
Updates ▶️ https://t.co/seGdvpFWwh #TATAWPL | #ClaimTheCrown | #GGvDC | #Eliminator pic.twitter.com/zNo5kz93TZ
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
భారీ ఛేదనలో ఓపెనర్లు లిజెల్లే లీ(43), షఫాలీ వర్మ(31) ఎడాపెడా బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు. వీరిద్దరూ పోటాపోటీగా దంచగా.. పవర్ ప్లేలోనే 75 పరుగులు చేసింది ఢిల్లీ. వీరకొట్టుడుతో లక్ష్యాన్ని కరిగిస్తున్న ఈ ద్వయాన్ని ఎట్టకేలకు వరేహం విడదీసింది. డేంజరస్ లిజెల్లీ ఎల్బీగా ఔట్ కావడంతో గుజరాత్ ఊపిరిపీల్చుకుంది. అదే ఓవర్లో కట్ షాట్ ఆడబోయిన షఫాలీ క్లీన్‌బౌల్డ్ అయింది. అనంతరం లారా వొల్వార్డ్త్(32 నాటౌట్) జతగా జెమీమా రోడ్రిగ్స్(41) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఢిల్లీని గెలుపువాకిట నిలిపిన జెమీమా విజయానికి 9 పరుగుల దూరంలో ఔటయ్యింది. మరిజానే కాప్ (4 నాటౌట్) లాంఛనం పూర్తి చేసింది. వరేహం వేసిన 16వ ఓవర్లో తను బౌండరీ కొట్టడంతో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి మోగించి నాలుగోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
Shafali Verma in the house! 🔥
🎥 She is looking in great touch early in the run chase 👏
Updates ▶️ https://t.co/seGdvpFWwh #TATAWPL | #ClaimTheCrown | #GGvDC | #Eliminator | @TheShafaliVerma pic.twitter.com/hZHxSLcJm0
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
మూనీ అర్ధ శతకంతో..
గుజరాత్ జెయింట్స్ ఆరంభంలో తడబడినా ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. పవర్ ప్లేలో చిన్నెల్లీ హెన్రీ(3-35), నందిని శర్మ (2-44)ల విజృంభణతో కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను బేత్ మూనీ(62 నాటౌట్) ఆదుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మొక్కవోని సంకల్పంతో ఆడిన తను జార్జియా వరేహం(35) తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించింది. ఆఖర్లో కష్వీ గౌతమ్(18), మూనీలు బౌండరీలతో చెలరేగగా నిర్ణీత ఓవర్లలో 168 పరుగులతో ఢిల్లీకి సవాల్ విసిరింది గుజరాత్.
Innings Break!
Spirited fightback with the bat by @Giant_Cricket 💪#GG or #DC – Who is heading to the final? 🤔
Scorecard ▶️ https://t.co/seGdvpFWwh #TATAWPL | #ClaimTheCrown | #GGvDC | #Eliminator pic.twitter.com/z3H8ld8heW
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

