KTR : ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మాజీ శాసనసభ్యుడిగా ఆయన సేనల్ని గుర్తు చేసుకుంటున్నారు. పాషా ఖాద్రీ కన్నుమూయడంపై విచారం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ పోస్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) సంతాపం ప్రకటించారు.
ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ సాబ్ మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. హుందాగా ఉండే ఆయన ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపించేవారు. మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ పాతబస్తీలోని పురాతన కట్టడాలకు మెరుగులు దిద్దే కార్యక్రమంలో భాగంగా ఖాద్రీతలో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఖాద్రీ ఆత్మకు శాంతి చేకూరాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.
Saddened to hear about the passing of Former MLA Charminar Syed Ahmed Pasha Quadri Saab. He was a courteous man always seen with a smile
I’ve had the opportunity of working closely with him as Municipal Minister for the improvement of heritage projects in the old city of… pic.twitter.com/vqT8pWETh9
— KTR (@KTRBRS) February 3, 2026
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా ఖాద్రీ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏఐఎంఐఎం పార్టీతో కొనసాగిన ఆయన.. 72 ఏళ్ల వయసులో మరణించారు. ఆరోగ్య సమస్యల కారణంగా 2023లో ఖాద్రీ ఎన్నికల్లో పోటీకి దూరమైన ఆయన.. ఆపై పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూసుకున్నారు. ఏఐఎంఐఎం పార్టీ వ్యవస్థాపకుడు సలాలుద్దీన్ ఒవైసీకి విశ్వసనీయుడైన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కీలక నేతగా ఎదిగారు.
ప్రస్తుత అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతోనూ సఖ్యతో మెలిగిన ఖాద్రీ.. చార్మినార్ నుంచి మూడుసార్లు (2004 నుంచి 2018) ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం యాకుత్‌పుర నియోజకవర్గ ప్రతినిధిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023 నుంచి ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల కారణంతో ఖాద్రీ.. పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూసుకున్నారు. ఈమధ్య కాలంలో రెండు పర్యాయాలు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు కూడా. అయినా సరే ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో మంగళవారం ఖాద్రీ కన్నుమూశారు.