
కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 17 : ఈసీఐఎల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి.. అడ్వాన్స్‌గా డబ్బులు దండుకుని తప్పించుకుని తిరుగుతున్న ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఉద్యోగిని కేపీహెచ్‌బీకాలనీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిమర్రి ప్రాంతానికి చెందిన కంబదుర రవికుమార్ (30) ఈసీఐఎల్‌లో ఉద్యోగిగా పనిచేస్తూ..వనస్థలిపురంలో ఉంటున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన కలువల క్రాంతికుమార్ (31) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ..కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-1లో నివాసముంటున్నాడు. న్యూస్ పేపర్లో వచ్చిన ప్రకటనలో తెలిపిన నంబర్‌కు క్రాంతికుమార్ ఫోన్ చేసి.. ఉద్యోగం కావాలని అడగగా, రవికుమార్ అందుబాటులోకి వచ్చాడు.
ఈసీఐఎల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని.. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఉద్యోగం కావాలంటే రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే ఈ విషయాన్ని క్రాంతికుమార్ తన స్నేహితుడైన అరుణ్‌తో పాటు అనిల్, సాయి, ప్రతాప్, రాఘవరెడ్డిలకు కూడా తెలపడంతో అందరూ కలిసి జూలై 16న ఈసీఐఎల్‌లో రవికుమార్‌ను కలిశారు. మాయమాటలు చెప్పిన రవి.. వారి వద్ద రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని ముఖం చాటేశాడు. క్రాంతికుమార్ కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రవికుమార్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.