
మల్కాజిగిరి, నవంబర్ 17 : పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడానికి ప్రావీణ్య ప్రతిభలో శిక్షణ ఇస్తున్నామని మల్కాజిగిరి బాలుర పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు వీరేశం అన్నారు. బుధవారం పాఠశాలలో 6,7, 8వ తరగతుల విద్యార్థులకు జాయ్ఫూల్ లర్నింగ్, మోటివేషన్, షార్ట్ ఫిలిం, క్రాఫ్ట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా హెచ్ఎం వీరేశం మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.