అమీర్పేట్, ఫిబ్రవరి 23 : వైద్యపరంగా ఎటువంటి అత్యావసర పరిస్థితులు తలెత్తినా, ఆశవర్కర్లు తమ ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి చేస్తున్న వైద్య సేవలు వెలకట్టలేనివని సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ఫోన్లను బుధవారం సనత్నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 32 మంది ఆశ వర్కర్లకు అమీర్పేట్ ఎస్పీహెచ్వో డాక్టర్ రేవతి, వైద్యాధికారి డాక్టర్ కళ్యాణిలతో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఆశవర్కర్లకు పెరుగుతున్న పని ఒత్తిడి ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ఆన్లైన్ విధానాల్లో పనులు చక్కబెట్టుకునే అవకాశాన్ని ఆశవర్కర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సనత్నగర్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.