
కీసర, నవంబర్ 15 : సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కాశబోయిన రమేశ్ ముదిరాజ్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంత్రి మంత్రి మల్లారెడ్డి సీఎం సహాయనిధి నుంచి రూ. 37,500 చెక్కును మంజూరు చేయించారు. మంత్రి ఆదేశాల మేరకు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆయన నివాసంలో లబ్ధిదారుడికి సోమవారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జంగయ్యయాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి గణేశ్, ఉపాధ్యక్షులు సుమన్, బన్నీలతో పాటు పలువురు పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీకి చెందిన ఇద్దరికి…
శామీర్‌పేట : తూంకుంట మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన జి.సురేశ్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60 వేలు, 4వ వార్డుకు చెందిన ఎం.శ్రీనివాస్‌కు రూ.60 వేల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను చైర్మన్ రాజేశ్వర్‌రావు లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. కౌన్సిలర్లు రాజ్‌కుమార్ యాదవ్, హరిబాబుగౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.