సికింద్రాబాద్, ఫిబ్రవరి 20: కంటోన్మెంట్ పరిధిలోని ఆరో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అన్నారు.ఆదివారం పాదయాత్రలో భాగంగా వార్డులోని తాడ్బండ్లోని పలు బస్తీల్లో స్థానికులతో కలిసి పాండుయాదవ్ పర్యటించారు. ఈసందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్న తాగునీటి పథకం తో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, ప్యాచ్ వర్కులు, చెత్త క్లీనింగ్ వంటి అంశాలపై మాట్లాడారు. తాడ్బండ్ పరిసర ప్రాంతాల్లో చెత్త సేకరణ సరిగా లేకపోవడం వంటివి స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పాండుయాదవ్ బోర్డు అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. నిత్యం వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే కొంతమంది కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.కార్యక్రమంలో గణేశ్, గౌసి యా బేగం, విజయ, మెహబూబ్ పాల్గొన్నారు.