షేక్‌పేట్ ఫిబ్రవరి 20: ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఆదివారం షేక్‌పేట్ డివిజన్ లక్ష్మీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యదర్శి షకీల్ అహ్మద్,కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అఖిలేశ్, ప్రధాన కార్యదర్శి నవీన్‌రెడ్డి, కృష్ణయ్య, రామిరెడ్డి, జనార్దన్ రెడ్డి, విక్రమ్ వర్మ, శ్రీనివాస్, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, మాదవ్‌రావు, అనురాధ,రామ తదితరులు పాల్గొన్నారు.