అల్లాపూర్,ఫిబ్రవరి20: డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం అల్లాపూర్ డివిజన్ పరిధి రాజీవ్‌గాంధీనగర్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి పర్యటించారు. మొదట బస్తీలోని శివాలయం, హనుమాండ్ల ఆలయం, సాయి బాబా ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసి.. అనంతరం రాజీవ్‌గాంధీనగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే సమస్యల పై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, సీసీరోడ్లు వేయాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమ్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. గత ఏడేళ్లుగా అల్లాపూర్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు.